English | Telugu

యూట్యూబ్ లో రెడ్డిగారు వెబ్ సిరీస్ కి ఫుల్ క్రేజ్.. అసలేం ఉందంటే!


యూట్యూబ్ లో వారానికో వెబ్ సిరీస్ వచ్చేస్తుంది. వాటిల్లో కొన్ని మాత్రమే హిట్ అవుతాయి. అలాగే
కొన్ని వెబ్ సిరీస్ లు చూస్తే అబ్బా ఇదేం స్టోరీరా బాబు అనిపిస్తుంది. ‌అలాగే మరికొన్ని సిరీస్ లు అయితే.. అప్పుడే ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసిందా అనిపిస్తుంది. ‌అలాంటి వాటిల్లో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ ' రెడ్డిగారు'. ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం..

ప్రశాంత్ రగతి రాసిన ఈ కథకి జెడీవి ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీజ రెడ్డి, చందు జెసి, జెడీవీ ప్రసాద్, సాత్విక్ జి రాయ్ ప్రధాన పాత్రలుగా ఈ సిరీస్ మొదలైంది. 'మా విడాకులు' వెబ్ సిరీస్ తో ప్రసాద్ బెహరా, విరాజిత యూట్యూబ్ లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్రసాద్‌ బెహరా కామెడీ టైమింగ్ , డైలాగ్ డెలివరీ కోసం ఎంతోమంది నెటిజన్లు తను చేసిన ఈ మా విడాకులు వెబ్ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్ లని చూసి ఆదరించారు. అదేవిధంగా విరాజిత, ప్రసాద్ బెహరా, ఇంకా కొంతమంది కలిసి 'పెళ్ళి వారమండి' అనే వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేశారు. ఇది మొత్తంగా పది ఎపిసోడ్ లతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ప్రసాద్ బెహరాకి సినిమా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ‌ఇక ఈ సిరీస్ లో ప్రసాద్ బెహరాతో సరిసమానంగా చేసిన రెడ్డిగారు అలియాస్ జెడీవీ ప్రసాద్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇతను కొత్తగా "రెడ్డి గారు" అనే సిరీస్ ని మొదలెట్టాడు.

అయిదు సంవత్సరాల ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకున్న రెడ్డిగారికి అదృష్టం కలిసొస్తుంది‌‌. ఈ సిరీస్ ఇప్పటికే నాలుగు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక అయిదవ ఎపిసోడ్ లో రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అతని ఇంటర్వ్యూ చేసే విధానం నవ్వు తెప్పించేలా ఉంది‌. ఇక ఇంటర్వ్యూ ముగిసాక ఓ ప్రాజెక్ట్ ఆన్ టైమ్ లో చేయాలని లేకపోతే కష్టమని జేసీ అతని హెచ్ఆర్ సుప్రియ చెప్తారు. రెడ్డిని టీమ్ లీడర్ గా ఉండి తన టీమ్ తో ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ చేపించాలని లేదంటే తట్టా బుట్టా సర్దుకొని రాజమండ్రి వెళ్లిపోవాలని సుప్రియ చెప్తుంది. దాంతో రెడ్డిగారు ఆలోచనలో పడతాడు. మరి అతను ప్రాజెక్టు పూర్తిచేస్తాడా లేదా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.