దిక్కులు చూడకు రామయ్యా రివ్యూ
ప్రేమ... ఈ సబ్జెక్ట్ ఓ అక్షయపాత్ర. ఎన్ని కథలు రాసుకొన్నా... ఏదో ఓ కోణం మిగిలిపోయే ఉంటుంది. పాత కథనే కొత్తగా కోటింగ్ ఇచ్చి తీసినా, చూసి తరించిపోవడానికి ప్రేక్షకులు కూడా సదా సిద్ధంగానే ఉంటారు. కానీ ఆడియన్స్ని కన్వెన్స్ చేసే స్థాయి ఆ కథకి, అందులోంచి పుట్టుకొచ్చే సన్నివేశాలకు ఉండాలి.