English | Telugu

క్లైమాక్స్ చేరిన 'పవన్' లీలలు

బాలీవుడ్ హిట్టైన 'ఓ మై గాడ్' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి చేస్తున్నారు. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా అలరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా సైలెంట్ గా సాగిపోతుంది. ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక్క అఫిషియల్ న్యూస్ కూడా బయటకు రాలేదు. ఇంతకీ గోపాల గోపాల ఎంత వరకు వచ్చింది? ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి చేశారట. కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుందట. ఈ మూవీ చిత్రీకరణ మొత్తం ఈ నెలాఖరుకు పూర్తవుతుందని అంటున్నారు. అలాగే నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, డిసెంబర్ లో చిత్ర ప్రచారం మొదలుపెట్టి, జనవరి లో రిలీజ్ చేస్తారట. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.