English | Telugu
బాహుబలి 2015 లో పార్ట్ 1, 2016లో పార్ట్ 2..!
Updated : Oct 11, 2014
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా భారీ తారాగణంతో డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రేక్షకులను మైమరపించే అద్భుతమైన యుద్ద సన్నివేశాలను తెరకెక్కించారు రాజమౌళి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకి దీటుగా వుంటాయట. ముందుగా చెప్పినట్టే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారట. మొదటి భాగాన్ని 2015వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ సభ్యులు భాగా కష్టపడుతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. అలాగే రెండో భాగాన్ని 2016లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.