English | Telugu

గోవిందుడు హిట్టా..? ఫ‌ట్టా..??

ఈ ద‌స‌రా స్పెష‌ల్‌గా వ‌చ్చిన సినిమా గోవిందుడు అంద‌రివాడేలే. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు పాజిటీవ్ వైబ్రేష‌న్స్ బాగానే ఉండేవి. కృష్ణ‌వంశీకి గ‌త కొంత‌కాలంగా విజయాల్లేవు క‌దా, టీజ‌ర్ రిలీజ్ రోజున కూడా చాలా ఎమోష‌న్ అయిపోయాడు, డూ ఆర్ డై అనుకొని ఈ సినిమా తీసుంటాడు. దానికి తోడు చిరు కెలుకుడు కూడా వీర‌లెవిల్లో సాగింది... ఇక హిట్టు ఖాయ‌మే అనుకొన్నారంతా. ఆ వైబ్రేష‌న్స్‌తోనే థియేట‌ర్ల‌లో అడుగుపెట్టారు. పెట్టాక తెలిసింది... గోవిందుడు అస‌లు స్వ‌రూపం సంగ‌తి! ఈ సినిమా హిట్టో... హిట్టు అని మెగా అభిమానులు గొంతు చించుకొంటున్నా... వ‌సూళ్లు మాత్రం ఆ రేంజులో లేవ‌న్న‌ది నిజం. రెండు వారాల‌కు ఈ సినిమా రూ.40 కోట్లు తెచ్చుకొందోచ్ అని అంటున్నారు గానీ వాస్త‌వానికి గోవిందుడు రూ.30 కోట్ల‌కు మించి వ‌సూలు చేయ‌లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

శాటిలైట్ హ‌క్కులు క‌లుపుకొంటే రూ.40 కోట్లు వ‌చ్చిన‌ట్టు. ఇక ముందు వ‌సూళ్లు ఉంటాయ‌ని అనుకోవ‌డం అత్యాసే. ఎందుకంటే క‌రెంటుతీగ‌, ఒక లైలా కోసం సినిమాలు వ‌చ్చే వారం విడుద‌ల కానున్నాయి. దానికి తోడు గోవిందుడుకి రిపీటెడ్ ఆడియ‌న్స్ లేరు... రారు. అంటే చ‌ర‌ణ్ సినిమా రూ.40 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోవ‌డం ఖాయం. కానీ ఈ సినిమా బ‌డ్జెట్ రూ48 కోట్లు. అంటే ఎనిమిది కోట్లు న‌ష్ట‌మ‌న్న‌మాట‌. కొన్ని చోట్ల‌.. ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేద‌ని.. బ‌య్య‌ర్లు వాపోతున్నారు. దానికి తోడు బండ్ల గ‌ణేష్ కొంత‌మంది పారితోషికాలు ఎగ్గొట్టాడ‌ట‌. యూనిట్ స‌భ్యుల‌కు ఇంకా పూర్తి మొత్తంలో డ‌బ్బులివ్వ‌లేద‌ని, అడిగితే త‌ప్పించుకొని తిరుగుతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాపై ఇప్పుడు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. ప్ర‌మోష‌న్ చేసుకొంటే చేసుకోండి, లేదంటే మానేయండి అంటూ వ‌దిలేశాడ‌ట‌. మొన్న స‌క్సెస్‌మీట్ లో చ‌ర‌ణ్ అదృశ్యానికి కార‌ణం ఇదే. రామ్‌చ‌ర‌ణ్ కాకుండా మ‌రో హీరో అయితే ఫ‌లితం వేరే రేంజులో ఉండేద‌ని కృష్ణ‌వంశీ కూడా స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట‌. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ సినిమాకి ప్ర‌ధాన మైన‌స్ చ‌ర‌ణే అని విమ‌ర్శ‌కులు చ‌ర‌ణ్‌ని టార్గెట్ చేశారు. చ‌ర‌ణ్ హావ‌భావాల‌ను స‌రిగా ప‌లికించ‌లేక‌పోయాడ‌ని, కృష్ణ‌వంశీ సినిమాల్లో హీరో తేలిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అని విమ‌ర్శించారు. సెట్లో చ‌ర‌ణ్ కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెట్టాడ‌ట‌. ఒకొక్క షాట్‌కీ టేకుల మీద టేకులు తీసుకొన్నాడ‌ట‌. రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు సిగ్గు ప‌డిపోయేవాడ‌ట‌. కొన్నిసార్లు లొకేష‌న్ వ‌దిలేసి వెళ్లిపోయాడ‌ట‌. దాంతో కృష్ణ‌వంశీకీ ఒకానొక సంద‌ర్భంలో చిర్రొత్తికొచ్చేద‌ని యూనిట్ స‌భ్యులే చెప్పుకొంటున్నారు.

ద‌స‌రా సెల‌వ‌లు.. ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చాయి. దాంతో ఓపెనింగ్స్ బాగానే రాబ‌ట్టుకొంది. తొలి మూడు రోజులు గోవిందుడుదే హ‌వా. అయితే ఆ త‌రువాతి నుంచి వ‌సూళ్లు త‌గ్గాయి. ఏ స్థాయిలో అంటే గోవిందుడు కంటే లౌక్యం సినిమాకి కొన్ని చోట్ల వ‌సూళ్లు బాగా వ‌చ్చాయి. ప‌డిపోయింది అనుకొన్న గోపీచంద్ సినిమాని చ‌ర‌ణ్ వ‌చ్చి నిల‌బెట్టిన‌ట్టైంది. తొలి మూడు రోజుల వ‌సూళ్లు చూసి మురిసిపోయిన చిత్ర‌బృందం.. ఆ త‌రువాత లెక్క‌లు వేసుకొని బావురుమంటోంది. హిట్ టాక్ వ‌చ్చింది క‌దా అని పైకి చిరున‌వ్వులు చిందిస్తున్నారు గానీ, లోలోప‌ల న‌ష్టామెంతో లెక్క‌లు వేసుకొంటూనే ఉన్నారు.
అదీ... గోవిందుడు వెనుక ఉన్న అస‌లు క‌థ‌. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలూ... గోవిందుడు హిట్టా..? ఫ‌ట్టా..??

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.