English | Telugu

వెంకీ, రవితేజల మల్టీస్టారర్

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో విక్టరీ వెంకటేష్. ఎలాంటి బేషజాలు లేకుండా స్టొరీ బాగుంటే చిన్న హీరోతో కూడా కలిసి నటించడానికి రెడీగా వుంటారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాలు వుంటాయా అని అందరూ అనుకుంటున్న సమయంలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”తో మహేష్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రాల పద్దతిని పునఃప్రారంభించాడు వెంకటేష్. తరువాత వెంటనే రామ్ తో నవ్వుల “మసాలా” అందించాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ తో కలిసి 'గోపాల గోపాల' అంటూ అభిమానులను అలరించడానికి సిద్దమవబోతున్నాడు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజతో కలిసి మరో మల్టీస్టారర్‌కి సిద్ధమవుతున్నాడు వెంకటేష్. వీరు పోట్ల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈమూవీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి తరువాత సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.