English | Telugu

తుఫాను బాధితులకు పవన్, చరణ్ ఆర్థిక సాయం

హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలుగు సినిమా తారలు తమ వంతు సహాయాన్ని అందించటానికి ముందుకు వస్తున్నారు. సినీ నటులు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ 10 లక్షల ప్రకటించగా, పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. తుఫాను బాధితులను రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా కృషి చేసి ఆదుకోవాలని పవన్ అన్నారు. తుఫాను సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఫ్యాన్స్ కి ఆయన పిలుపునిచ్చారు. తుఫాను సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ౦ ప్రశంసనీయంగా పనిచేస్తు౦దని రామ్‌చరణ్ ప్రశంసించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.