మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ రివ్యూ
తెలుగు తెరపై చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్వచ్ఛమైన ప్రేమకథ.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.. ప్రేమించిన వ్యక్తి నుంచి విడిపోయినా ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ చావదు.. అనే కాన్సెప్టుతో ఓ సిన్సియర్ ప్రయత్నం చేశాడు క్రాంతి మాధవ్. ఎంత స్వచ్ఛమైన కాన్సెప్టును ఎంచుకున్నాడో.. అంతే స్వచ్ఛంగా దాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. కామెడీ, సెంటిమెంట్, ట్విస్టులు అని లెక్కలేసుకోకుండా.. తను చెప్పాలనుకున్నది సిన్సియర్‌గా, పక్కదారి పట్టకుండా చెప్పాడతను