ఫ్లాప్ సినిమా ఐదు వేల స్క్రీన్ లలో..
చైనాలో న్యూ ఇయర్ కి శంకర్ ఐ సినిమా అక్కడ విడుదల కానుంది. ఏకంగా ఒకేసారి ఐదు వేల స్క్రీన్ ల మీద ప్రదర్శితం కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన 'ఐ' చైనా లో మాత్రం కాస్తంత లేటుగా విడుదల కానుంది. ఈ మేరకు చైనీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. అక్కడ సెన్సార్ షిప్ కూడా పూర్తయ్యిందని.. ఇక విడుదలే తరువాయి అని సమాచారం.