English | Telugu

టెంపర్ కి టేబుల్ ప్రాఫిట్

టెంపర్ హైప్ ఊపందుకొంటో౦ది. జూనియర్ లుక్, డైలాగ్స్, పూరీ మార్క్ ఇవన్నీ కలిసి ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. సినిమా బిజినెస్ కూడా ఊపందుకునేలా చేసింది. తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిర్మాత లాభాల్లోకి వచ్చేశాడని అంటున్నాయి. వరల్డ్ వైడ్‌గా ‘టెంపర్’ దాదాపు 44 కోట్ల బిజినెస్ చేసినట్టు టాక్. ఏరియాల వారిగా ఇలా వున్నాయి.

నైజాం- 11 కోట్లు
సీడెడ్- 6.30,
నెల్లూరు- 1.65,
కృష్ణ-2.75,
గుంటూరు-3.30,
వైజాగ్- 4 కోట్లు,
వెస్ట్-ఈస్ట్- 4.82 కోట్లకు థియేటర్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
ఇక కర్ణాటక-4.50 కోట్లు,
రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు,
ఓవర్సీస్- 3.60 కోట్లకు వెళ్లిందట. శాటిలైట్ రైట్స్‌తోపాటు అన్నీ చూసుకుంటే దాదాపు 10 కోట్లు ప్రాఫిట్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.