English | Telugu

మధురిమ‌.. రెండోస్సారి

ఐటెమ్‌కి ఎప్పుడు కొర‌త వ‌చ్చినా 'మాజీ' హీరోయిన్స్ చేత ఊర మాస్ గీతాల‌కు స్టెప్పులు వేయించ‌డం అల‌వాటు చేసుకొన్నారు మ‌న ద‌ర్శ‌కులు. తాజాగా వారి క‌న్ను మ‌ధురిమ‌పై ప‌డింది. వంశీ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొన్న మ‌ధురిమ ఆట‌లు ఎంతో కాలం సాగ‌లేదు. అర‌డ‌జ‌ను సినిమాల‌తోనే 'సైడ్' అయిపోయింది. `కొత్త జంట‌`తో ఐటెమ్ గాళ్‌గా మారింది. 'టెంప‌ర్‌'లో ఓ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇప్పుడు త‌న కెరీర్‌లో రెండోస్సారి ఐటెమ్ పాట చేయ‌బోతోంది. నాగ‌చైత‌న్య - సుధీర్‌వ‌ర్మ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. క‌థ‌లో ఓ ఐటెమ్ సాంగ్ ఉంద‌ట‌. ఈ పాట మ‌ధురిమ‌తో చేయించాల‌ని చిత్ర‌బృందం ఫిక్స‌య్యింది. హీరోయిన్‌గా ఎలాగూ ఛాన్సులు రావ‌డం లేదు. క‌నీసం ఇలాగైనా బండి లాగిస్తుందేమో చూడాలి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.