English | Telugu

చిరు కోసం అనుష్క‌, న‌య‌న‌తార‌

చిరంజీవి 150వ సినిమా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. క‌థ విష‌యంలో ఇప్ప‌టికే చిరు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడెవ‌ర‌నేది ఓ వారం ప‌దిహేను రోజుల్లో తెలిసిపోతుంది. ఈలోగా క‌థానాయిక కోసం కూడా అన్వేష‌ణ మొద‌లెట్టేశారు. చిరు వ‌య‌సుకీ, ఆయ‌న ఇమేజ్‌కి త‌గిన క‌థానాయిక ఉంటే బాగుంటుంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. చిరు ప‌క్క‌న అనుష్క, న‌య‌న‌తార ఇద్ద‌రిలో ఒక‌రైతే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. చిరు ఇప్ప‌టి వ‌ర‌కూ న‌య‌న‌తార‌తో క‌ల‌సి ప‌నిచేయ‌లేదు. బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌లాంటి స్టార్ల‌తో న‌టించిన న‌య‌న‌కు... చిరుతోనూ క‌ల‌సి న‌టించే ఛాన్స్ రాలేదు. స్టాలిన్‌లో ఓ ఐటెమ్ పాట‌లో క‌నిపించింది అనుష్క‌. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ తెర‌ను పంచుకోలేదు. చిరు క‌థానాయిక‌ల కోసం త‌యారు చేసిన లిస్టులో న‌య‌న‌, అనుష్క‌ల‌కే అగ్ర తాంబూలం. ఇద్ద‌రిలో ఎవ‌రి కాల్షీట్లు అందుబాటులో ఉంటే వాళ్లే క‌థానాయిక‌లుగా ఫిక్స‌య్యే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రిలో ఎవ‌రు ఫైన‌ల్ అయినా... మెగా ఫ్యాన్స్ ఖుషీ అవ్వ‌డం ఖాయం.