English | Telugu
రూ.8 కోట్లతో పవన్ సినిమా తీసేశారా??
Updated : Feb 7, 2015
పవన్ కల్యాణ్... వెంకటేష్ - ఇద్దరూ స్టార్ హీరోలే! పవన్ తో సినిమా చేయాలంటే మినిమం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకు వెంకీ కూడా యాడ్ అయ్యాడు. అంటే కనీసం రూ.60 కోట్ల బడ్జెట్ వేసుకోవాలి. అలాంటిది ఈ ఇద్దరితో సినిమాని కేవలం రూ.8 కోట్లతో తీసేశారంటే నమ్ముతారా...?? కానీ ఇది నిజం. నిర్మాత డి.సురేష్ బాబు మాస్టర్ మైండ్‌కి ఇదే సాక్ష్యం. గోపాల గోపాల బడ్జెట్ కేవలం రూ.8 కోట్లు! పవన్, వెంకీ పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో వాటా మాత్రమే ఇచ్చారు. శ్రియ, రీమేక్ రైట్స్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూకి పారితోషికాలు, మేకింగ్ కోసం... ఇలా మొత్తానికి రూ.8 కోట్లతో సినిమా తీశారని టాక్. ఈ సినిమా మొత్తం 3.4 సెట్స్‌లోనే తీసేశారు. ఆ మూడు సెట్లూ రామానాయుడు స్టూడియోలో వేసినవే. భారీ ఛేజింగులు, ఫైటింగులు లేవు. పాటలకూ స్కోప్ లేదు. అందుకే రూ.8 కోట్లతో లాగించేశారు. ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రూ.30 కోట్లు! ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమా ఇంత టేబుల్ ప్రాఫిట్ చూడలేదు. అత్తారింటికి దారేది లాభాల శాతం కూడా ఇంత ఎక్కువగా ఏం లేదు. సినిమాకొచ్చిన లాభాల నుంచి వెంకీ, పవన్‌లు తమ పారితోషికాలు తీసుకొన్నార్ట. వెంకీకి రూ.5 కోట్లకంటే ఎక్కువే గిట్టింది. వెంకీ ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి. ఇంత పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీసుకొంటే.. నిర్మాతలక లాభాలే లాభాలు. ఈ విషయంలో సురేష్ బాబుని మెచ్చుకొని తీరాల్సిందే.