శ్రియ.. నీలో ఇంత ఉందా?
తెలుగు, తమిళం, హిందీ.. ఆఖరికి ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించి తన సత్తా చాటుకొంది శ్రియ. ఇప్పుడంటే ఆ వెలుగుల్లేవుగానీ.. ఒకప్పుడు టాప్ మోస్ట్ కథానాయిక. శ్రియలో కమర్షియల్ సినిమాలకు సరిపడా హీరోయినే కాదు, అభినయం తెల్సిన కథానాయిక కూడా ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆమె ఓ చిత్రకారిణి. ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేస్తుంటుంది. ఈమధ్య బొమ్మల్ని సీరియస్‌గా తీసుకొంది. ఆమె చేతులోంచి కొన్ని అద్భుతమైన చిత్రాలు పుట్టుకొచ్చాయి. సీసీఎల్, హృదయ ఫాండేషన్ కలసి చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు డొనేషన్లు సేకరించే కార్యక్రమం మొదలెట్టారు. అందులో భాగంగా శ్రియ వేసిన బొమ్మల్ని