English | Telugu

వ‌ర్మ ఎవ‌రి ఎఫైర్లు బ‌య‌ట‌పెడ‌తాడో..

వ‌ర్మ చుట్టు వివాదాలు తిరుగుతాయో, లేదంటే వ‌ర్మ నే వివాదాల చుట్టూ తిరుగుతాడో తెలీదు గానీ వ‌ర్మ న్యూస్ మేక‌ర్ అయిపోయాడు. వ‌ర్మ ఎఫైర్లు అనే టాపిక్ మీద ఓ పుస్త‌క‌మే రాయొచ్చు. దాదాపు తాను ప‌నిచేసిన అంద‌రు హీరోయిన్ల‌తోనూ స‌న్నిహితంగా ఉన్నాడు. వాళ్ల‌తో వ‌ర్మకు మీడియా చాలాసార్లు లింకులు క‌ట్టి.. వార్త‌లు సృష్టించింది. ఇప్పుడు వ‌ర్మ కూడా ఆ ఎఫైర్ల‌ను తెర‌పై చూపించ‌బోతున్నాడు. వ‌ర్మ తాజాగా స‌చిన్ జోషీని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు ఎఫైర్‌! తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా పేరుని బ‌ట్టి చెప్పేయొచ్చు, కంటెంట్‌లో ఎంత మ‌సాలా ఉంటుందో. బాలీవుడ్, టాలీవుడ్‌లోని ఎఫైర్ల‌ను వ‌ర్మ ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాడ‌ని స‌మాచారం. హై ఫై సొసైటీలో అక్ర‌మ సంబంధాలు ఎలా సాగుతున్నాయో... ఎఫైర్ ద్వారా చూపించ‌బోతున్నాడ‌ట‌. తాను చూసిన‌, విన్న (అనుభవించిన ) సంఘ‌ట‌న‌లూ ఈసినిమాలో పొందు ప‌ర‌చ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి వ‌ర్మ మ‌రోసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌ను కుదిపేసే మేట‌ర్‌తో వ‌స్తున్నాడు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూద్దాం.