ఆయన చెప్పమంటే కాదంటానా... నాని
దర్శక దిగ్గజం మణిరత్నం సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా.. ఎగిరి గంతెస్తారు. నటుడు నానికి కూడా అలాంటి అవకాశమే దక్కింది. ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఓకె కన్మణి' సినిమాను, 'ఓకే బంగారం' పేరుతో తెలుగులోకి అనువదించారు.