English | Telugu
గోపీచంద్ ‘జిల్’ టీజర్ అదిరింది
Updated : Mar 7, 2015
మిర్చిలో ప్రభాస్, రన్ రాజా రన్‌లో శర్వానంద్ స్టయిలిష్‌గా చూపించిన యు.వి. క్రియేషన్స్ మరో మాస్ హీరోని స్టైలిష్ హీరోగా మార్చేసింది. గోపీచంద్‌ని ఇప్పటికి వరకు అందరూ చాలా మాసిగా చూపించారే తప్ప స్టయిలిష్ యాంగిల్లో ఎవరూ చూపించడానికి ధైర్యం చేయలేదు. అయితే లేటెస్ట్ తెరకెక్కిన ‘జిల్’ చిత్రం గోపీని స్టయిలిష్ యాక్టర్ గా మార్చేశాడు కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్. జిల్’ చిత్రం టీజర్‌లో స్టయిలిష్ గోపీతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రంలో గోపీచంద్ నుంచి కోరుకునే యాక్షన్‌తో పాటు వినోదానికి కూడా లోటుండదట.మార్చి 12న జిల్ ఆడియో రిలీజ్ చేసి, మార్చి 27న జిల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.