English | Telugu

ఆయన చెప్పమంటే కాదంటానా... నాని

దర్శక దిగ్గజం మణిరత్నం సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా.. ఎగిరి గంతెస్తారు. నటుడు నానికి కూడా అలాంటి అవకాశమే దక్కింది. ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఓకె కన్మణి' సినిమాను, 'ఓకే బంగారం' పేరుతో తెలుగులోకి అనువదించారు. అయితే ఈ సినిమాలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పాలని మణిరత్నం నానికి ఫోన్ చేసి అడిగారు. తన గొంతు అరువు ఇవ్వాలని మణిరత్నం అడిగితే కాదనలేకపోయానని, నిమిషం కూడా ఆలోచించకుండా ఒకే చెప్పేశానని నాని అన్నారు. గతంలో నాని మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.