మెగా బ్రదర్స్ కలుస్తున్నారా?
కలసి ఉంటే కలదు సుఖం.. అనే నిజం మెగా బ్రదర్స్‌కు తెలిసొస్తోందా? త్వరలోగా అన్నదమ్ముళ్లంతా ఏకం కాబోతున్నారా? ప్రస్తుతం మెగా సమీకరణాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. చిరంజీవి - పవన్ కల్యాణ్‌ల మధ్య ఓ అడ్డుతెర ఉందని, ఇద్దరూ దాన్ని ఛేదించే ప్రయత్నం చేయట్లేదని,ఆ అడ్డు తెర క్రమక్రమంగా గోడగా మారిందని మెగా ఫ్యాన్స్‌కు తెలుసు.