English | Telugu
మరో సీక్వెల్ ఉంది బాబూ...
Updated : Mar 7, 2015
ఈమధ్య సీక్వెల్‌ల హంగామా ఎక్కువైంది. ఓ సినిమా హిట్టయితే దాన్ని ఎలా కొనసాగించాలా?? అనే కోణంలో దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. స్వామి రారా కి సీక్వెల్‌గా మోసగాళ్లకు మోసగాడు రెడీ అయ్యింది. టెంపర్ 2 తీద్దామని బండ్ల గణేష్ గట్టి ప్లాన్ వేశాడు. ఇప్పుడు మరో కొనసాగింపు చిత్రం రాబోతోంది. అదే కార్తికేయ. చందూమొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం అందుకొంది. ఇప్పుడు కార్తికేయ 2 కీ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిఖిల్ హీరోగా నటించబోతున్నాడు. చందూ ఆల్రెడీ ఓలైన్ రెడీ చేసేశాడు. అది నిఖిల్‌కీ నచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈసినిమాని పట్టాలెక్కించాలనిచూస్తున్నారు. చందూ ప్రస్తుతం నాగచైతన్య తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అది పూర్తయ్యాకే... కార్తికేయ 2 ఉండే అవకాశాలున్నాయి.