English | Telugu

స‌మంత - సిద్దూ - మ‌ళ్లీ ప‌డిపోయారా?

మాజీ ప్రేమికులు సిద్దార్థ్ - స‌మంత‌లు మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిపోయారా??? నిన్న‌టి వ‌ర‌కూ తూచ్ చెప్పుకొన్న ఈ జంట మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ చిగురిస్తోందా?? స‌మంత - సిద్దూల ట్వీట్లు చూస్తే ఈ డౌటే వ‌స్తుంది. రెండేళ్ల పాటు గప్ చుప్ గా ప్రేమించుకొన్న సిద్దార్థ్‌, స‌మంత స‌డ‌న్‌గా విడిపోయారు. పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అనుకొన్న త‌రుణంలో బ్రేక‌ప్ చెప్పేసుకొన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్లిద్ద‌రూ ట‌చ్‌లోకి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచార‌మ్‌. సిద్దూ న‌టించిన ఎన‌కుళ్ వ‌రుగ‌ణ్ అనే సినిమా హోలీ రోజున విడుద‌లైంది. ఈసినిమా బాగుంద‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సిద్దార్థ్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ విష‌యం తెలిసి స‌మంత పొంగిపోయింది. ఆనందం ఆపుకోలేక వెంట‌నే ట్వీట్ చేసింది. నీ సినిమా బాగుంద‌ని తెలిసింది.. నీ న‌ట‌న‌కు ప్ర‌సంశ‌లు ద‌క్కుతోంటే ఆనందంగా ఉంది.. అంటూ ట్వీట్ చేసింది. సిద్దూ కూడా రియాక్ట్ అయి స‌మంత‌కు థ్యాంక్స్ చెప్పాడు. దాంతో ఈ ప్రేమికుల మ‌ధ్య మ‌ళ్లీ స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ మొద‌లైందన్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఏమో..?? ఏం చెప్ప‌గ‌లం?? ప్రేమ ఎప్పుడైనా ఎక్క‌డైనా ఎలాగైనా పుట్టొచ్చు. ఆల్ ది బెస్ట్ స‌మంత‌....