English | Telugu
సూర్య హీరోయిన్ బికినీ వేస్తుందట
Updated : Mar 7, 2015
ఒక్క సినిమా చేసిందో లేదో త్రిధ చౌదరికి అప్పుడే కమర్షియల్ హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ అబ్బేశాయి. ఇది గ్లామర్ ఫీల్డ్... అందంగా కనిపించడంలో తప్పేం లేదు.. అంటోంది. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో తెలుగులతో ఎంటర్ అయ్యిందీ బెంగాలీ పాప. తొలి సినిమాతో కాస్తో కూస్తో ఆకట్టుకోగలిగింది. ఇక మీదట ఎలాంటి పాత్రకైనా సిద్ధమే అని అవసరమైతే బికినీ కూడా వేస్తానంటోంది. ''దర్శకులు ఏం చెప్తే అది చేయాలి..పాత్ర కోసం ఎలా కనిపించడానికైనా రెడీనే. బికినీకి నా బాడీ కూడా అనువుగా ఉంటుంది. ఎప్పుడైనా అలాంటి అవకాశం వస్తే వదులుకోను..'' అంటోంది. తెలుగు సినిమాలో అవకాశం ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు చూస్తూ కూర్చుంటుందట. ఈమధ్యే టెంపర్ చూసి ఎన్టీఆర్ డాన్సులకు పడిపోయా అంటోంది..