English | Telugu

పవన్ తో అలీ సినిమా..!!

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరికి వరాల జల్లు కురిపిస్తున్నాడు. జనసేన అంటూ పేదల బాధలను పట్టించుకుంటూ ఒక మినీ సైజు దేవుడు అయ్యాడు. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు పవన్ తో సినిమాలు చేయడానికి కాసుకొని కూర్చున్నారు. అందరి కోరికలని 2019 ఎలక్షన్స్ లోపు తీర్చాలని పవన్ నిర్ణయించుకునట్టు తెలిసింది. అలీ, పవన్ కళ్యాణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క గోపాల గోపాల చిత్రంలో తప్ప పవన్ నటించిన దాదాపు ప్రతి సినిమాలో అలీ నటించాడు. అసలు విషయంలోకి వెళ్తే అలీ తనకు ఒక సినిమా చేసిపెట్టమని అడిగాడని, దానికి పవన్ మంచి కథను తీసుకొస్తే కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడట. ఈ చిత్రంతో అలీ నిర్మాత గా అవతారం ఎత్తనున్నాన్నడట. ప్రస్తుతం అలీ మంచి కథ కోసం, దర్శకుడి కోసం అన్వేషణ మొదలు పెట్టాడట.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.