English | Telugu

హోలి.. ప్రేక్ష‌కుడు బ‌లి

పండ‌గ రోజు కొత్త సినిమా చూసి మ‌స్త్ మ‌జా చేద్దామ‌నుకొంటాడు ప్రేక్ష‌కుడు. తెలుగు లోగిళ్ల‌లో పండ‌గ అంటే.. సినిమా కూడా. ఈసారి హోలీకి 5 సినిమాలొచ్చాయి. కానీ ఒక్క‌టీ ప్రేక్ష‌కులను మెప్పించ‌లేక‌పోవ‌డంతో బాక్సాఫీసు డీలా ప‌డిపోయిన‌ట్టైంది. సూర్య వ‌ర్సెస్ సూర్య‌లో పాయింట్ బాగున్నా ద‌ర్శ‌కుడు స‌రిగా డీల్ చేయ‌లేదు. అనేకుడులో క‌న్‌ఫ్యూజ‌న్స్ ఎక్కువ‌య్యాయి. ఈ రెండు సినిమాల్నీ కాస్త‌భ‌రించొచ్చు. అయితే ఈ రోజు విడుద‌లైన 3 సినిమాలూ ప్రేక్ష‌కుల్ని మూడు చెరువుల నీళ్లు తాగించాయి. ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది, పంచ‌మి, నాకైతే న‌చ్చింది సినిమాలు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాయి. థియేట‌ర్లో ఉన్న ఆ ప‌ది మంది కూడా బెంబెలెత్తిపోయేలా చేశాయి సినిమాలు. ద‌ర్శ‌కుడిగా ఆనందం ఆకాష్ త‌న పైత్యం చూపించుకొంటే.. ఉన్న ఒక్క పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని పంచ‌మి విసిగించింది. నాకైతే న‌చ్చింది త‌లాతోక లేని క‌థ‌నంతో ప్రేక్ష‌కుల్ని ఇబ్బంది పెట్టింది. రేప‌టి నుంచి ఈ మూడు సినిమాలు ఆడుతున్న థియేట‌ర్ల చుట్టుప‌క్క‌ల‌క్కూడా పోలేంత బ్యాడ్ టాక్ వ‌చ్చేసింది. ఈ రోజు ఇండియా వ‌ర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ కూడా బాక్సాఫీసుని దెబ్బ‌కొట్టింది. అస‌లే మ్యాచ్‌, దానికి తోడు చెత్త సినిమాలు.. వెర‌సి హోలీ రోజున థియేట‌ర్లు ఖాళీ అయ్యాయి. ఏదో కాల‌క్షేపం కోసం థియేట‌ర్ల‌కు వెళ్లిన‌వాళ్లు మాత్రం బ‌లైపోయారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.