English | Telugu
Shekhar basha: శేఖర్ బాషాపై ఆర్జీవీ బ్యూటీ సోనియా ఫైర్...
Updated : Sep 3, 2024
బిగ్ బాస్ గ్రాంఢ్ గా మొదలై మొత్తం ఏడు జోడీలుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళారు. వారిలో వారికి అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మొదటిది శేఖర్ బాషా, ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల మధ్య జరిగింది. అదేంటో ఓసారి చూసేద్దాం..
బిగ్ బాస్ వేకప్ సాంగ్ వేసాక అందరు డ్యాన్స్ చేసి వస్తారు. ఫుడ్, అండ్ గ్రాసరీ పంపిస్తారు బిగ్ బాస్. ఇక ఈ ఫుడ్ ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలని కండిషన్ కూడా చెప్తాడు. ఆయితే కాసేపటికి శేఖర్ బాషా అండ్ బ్యాచ్ ఆరెంజెస్‌తో క్యాచ్‌లు ఆడుకోవడం మొదలెట్టారు. ఇది చూసిన ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల.. ఓ డైలాగ్ కొట్టింది. ఎవరు ఆరెంజెస్‌తో ఆడుతున్నారో వాళ్లెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ ఆర్డర్ వేసింది. అయిన ఫుడ్డుతో ఆడుకోవడమేంటి అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. దీనికి అందరూ సైడ్ అయిపోయిన శేఖర్ బాషా మాత్రం తన యూట్యూబ్ వాదనలు మొదలెట్టేశాడు. బిగ్‌బాస్ రూల్స్‌లో ఫుడ్డుతో ఆడకూడదని ఎక్కడైనా రాశాడా.. అయినా ఆరెంజెస్‌తో ఆడకూడదని చెప్పడానికి నీకేం రూల్ ఉందంటు శేఖర్ బషా ఎదురుతిరిగాడు. దీనికి అంతే స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది సోనియా. నీకు ఇచ్చిన ఫుడ్ ని నువ్వు కింద పడేసుకొని తిను, ఎక్కడైనా పడేసుకొని తిను నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు.. నీ ఫుడ్డును నువ్వు డ్రైనేజ్‌లో వేసుకొనైనా తిను.. నీ ఇష్టం అది..ఎవరైతే మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టకండి అంటూ శేఖర్ పై సోనియా ఫుల్ ఫైర్ అయింది.
ఇక సోనియాకి శేఖర్ బాషా కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు. ఇదేమైనా దేశ జెండానా.. దీనికి అంత గౌరవం ఇవ్వడానికి అంటూ ఏదేదో మాట్లాడాడు. ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా. అంటే ఇప్పుడు కిందపడిన దాన్ని తింటున్న నేను పశువునా.. నేను మనిషిని కాదా అంటూ చేతిలో ఉన్న ఆరెంజ్‌ను తినేశాడు శేఖర్ బాషా. ఇక హౌస్ లో మొదటి రోజే సోనియా, శేఖర్ బాషా గొడవపడ్డారు. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి.