English | Telugu

రాఘవ అండర్ వేర్ మీద బులెట్ భాస్కర్ పేరు...


జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బులెట్ భాస్కర్ కామెంట్స్ కానీ రాకెట్ రాఘవ కౌంటర్లు కానీ మాములుగా లేవు. భలే ఫన్నీగా ఉన్నాయి. సరదా శుక్రవారం, సరిపోదా శనివారం టీమ్స్ మధ్య గొడవలు ప్రతీ వారం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం భాస్కర్ రాఘవకు ఒక సలహా ఇచ్చాడు. "రాఘవ గారు ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టిషర్ట్ మీద బులెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమ్మానుయేల్ " అని పేర్లు రాసుకోండి అనడు.

వెంటనే రాఘవ "సారీ అండి అండర్ వేర్ మీద భాస్కర్ పేరు రాసేసుకున్నా ఆల్రెడీ" అన్నాడు దానికి అందరూ పడీపడీ నవ్వేసాడు. "లక్ష రూపాయలు తెచ్చారా" అని భాస్కర్ అనేసరికి ఇలా అంటే అలా వస్తాయి అన్నాడు రాఘవా." "మా దగ్గర తీసుకున్న డబ్బులేగా ఎలా అరుగుతుందండి" అన్నాడు భాస్కర్ కుళ్లిపోతూ వెంటనే రాఘవ తన అండర్ వేర్ మీద చెయ్యేసి ఊరుకో భాస్కర్ ఊరుకో" అనేసరికి మాములుగా నవ్వలేదు అందరూ. కార్తీక్ ఇలా అని రాఘవ పిలిచేసరికి నడుచుకుంటూ వెళ్ళాడు అది చూసిన రాఘవ చూసావా "నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం" అని కౌంటర్ వేసాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...