English | Telugu
బెజవాడ బేబక్క గురించి ఎవరికి తెలియని నిజాలు!
Updated : Sep 2, 2024
బిగ్ బాస్ సీజన్ 8 లోకి 7వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన బేబక్క చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈమె యూట్యూబ్ లో కామెడీ వీడియోస్ ద్వారా వైరల్ గా మారింది. ముఖ్యంగా మంచు లక్ష్మిలాగా మాట్లాడడంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.
అసలే వెటకారం, కామెడీ కాస్త ఎక్కువేమో.. బేబక్క ఎంట్రీ కూడా అలానే ఇచ్చింది. నాగ్ రమ్మని పిలిస్తే రాకుండా స్టేజ్ మీదకి ఎవరితోనే హార్ట్ సింబల్స్ పంపింది. ఇక చిరాకొచ్చి ఈసారి రాక తప్పదని అంటే అప్పుడు సిగ్గుపడుతూ ఎంట్రీ ఇచ్చింది. ఇక నాగ్‌ని చూస్తూ ఆమె సిగ్గుపడిన ప్రతిసారి.. దయచేసి మీరు సిగ్గుపడకండి అంటూ అదుర్స్‌లో బ్రహ్మీ చెప్పిన డైలాగ్‌యే గుర్తొచ్చింది. ఇక నాగ్ కోసం ఒక పాట కూడా పాడింది బేబక్క. బెజవాడ బేబమ్మలు, బేబక్కలు ఎక్కువ ఉంటారని వాళ్లకి కనెక్ట్ కావడం కోసమే బెజవాడ బేబక్కగా మారానంటు చెప్పింది. బెజవాడ బేబక్కగా యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈమె అసలు పేరు మధు నెక్కంటి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈమెసి స్వయానా పెద్దనాన్న. బెజవాడ బేబక్క అమ్మ వాళ్ల అక్కనే రాఘవేంద్రరావు వివాహం చేసకున్నారు. ఇండస్ట్రీతో కూడా ఈమెకి బాగా టచ్ ఉంది.
బేబక్క స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జున ని చూస్తూ సిగ్గుపడుతుంది. నా కలల వీరుడు నువ్వే అంటూ వయ్యారలు తిప్పుకుంటూ ఉంటే గత సీజన్లో వచ్చిన కరాటే కళ్యాణిని గుర్తుచేసుకుంటారు. బేబక్క ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే రెండో మూడో వారంలోనే బయటకు వచ్చేలా కన్పిస్తుంది. బేబక్క అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. కానీ ఆ తర్వాత అక్కడే కొన్ని వందల షోలకి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క యాంకరింగ్ మాత్రమే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా బేబక్క తనలోని టాలెంట్ మొత్తం చూపించింది. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్‌లో పలు సాంగ్స్ పాడింది. నరేష్-పవిత్ర లోకేష్ చేసిన 'మళ్లీపెళ్లి' సహా 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఎన్ని చేసిన సరైన బ్రేక్ రాకపోవడంతో మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది బేబక్క.