English | Telugu
Biggboss 8 Promo: కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు!
Updated : Sep 3, 2024
బిగ్ బాస్ సీజన్-8 మొదలైన రెండు రోజులకే నామినేషన్లు మొదలయ్యాయి. ఇక ఈ సీజన్ కూడా సీరియల్ బ్యాచ్ వచ్చేసింది. అయితే హౌస్ లో కన్నడ వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉందని తెలుగు అభిమానులు ఫీల్ అవుతున్నారు.
నిఖిల్, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ ఇలా కన్నడ బిగ్ బాస్ చూస్తున్నామా అనేలా మారింది. అయితే ఈ రోజు వదిలిన ప్రోమోలో నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తుంది. వీటిలో ఒకరినొకరు గట్టిగానే తిట్టుకున్నారు. సోనియా ఆకుల ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది. కుకింగ్ హెడ్‌గా ఉన్నా బేబక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని చెప్పి సోనియా నామినేట్ చేసింది. ఇక వాళ్లిద్దరి నామినేషన్ జరుగుతుండగా.. కన్నడ బ్యాచ్ నిఖిల్, యష్మీలు మధ్యలోకి వెళ్ళి.. ఆమెని మాట్లాడనివ్వు అని అనడంతో.. వారికి సోనియా గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇది నా నామినేషన్స్.. మీరు చెప్తే నేను వినాల్సిన పనిలేదంటు చీఫ్ లకి కౌంటర్ ఇచ్చింది సోనియా.
సెకెండ్ నామినేషన్ గా నాగ మణికంఠని నామినేట్ చేసింది సోనియా. ఎవరితోనూ మాట్లాడటం లేదనే రీజన్ చెప్పడంతో మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు. 'ఊరికే కట్టేసిన కుక్క మొరిగినట్టుగా భౌ భౌ అని మొరగడం నా నేచర్ కాదు' అంటూ సోనియాకి మణికంఠ ఇచ్చిపడేశాడు. ఆ తరువాత శేఖర్ బాషాని నామినేట్ చేశాడు మణికంఠ. 'మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఒకేనా' అని మణికంఠ అనగానే.. ఒకేనా అంటే ఒకే కాదు అని శేఖర్ బాషా అనేసాడు. శేఖర్ బాషాని చూడగానే అందరికి ఒక్కసారిగా భోళే షావలి గుర్తొచ్చాడు. అందరు మరో భోళే షావలి అని శేఖర్ బాషాని అంటున్నారు. ఆ తరువాత ప్రేరణ, సోనియాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రేరణ అయితే పిచ్చెక్కినట్టు అరుస్తూ కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ చూడాల్సిందే.