English | Telugu
మోక్షతో దొరికిపోయిన విష్ణు ప్రియ.. డబ్బుకోసమే ఇలా చేసిందా?
Updated : Sep 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 మొదలైన రెండో రోజు నుండే ట్రోలింగ్ మొదలైంది. ఎంతలా అంటే లోపలికి వెళ్ళే ముందు కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలని తీసుకొని సోషల్ మీడియాలోని కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అందులో మొదటగా విష్ణుప్రియ చేరింది.
విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరు బిగ్ బాస్ లోకి వెళ్తారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక నిన్నటితో విష్ణుప్రియ ఒక్కతే కన్ఫమ్ అని తేలిపోయింది. అయితే బిగ్ బాస్ కి వెళ్ళేముందు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, అసలు వెళ్ళనని చెప్పింది. తనేం అందంటే.. ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది.. అలాంటప్పుడు ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి.. మన ఇంట్లో వాళ్లుంటారు.. వాళ్లని చూసుకోవాలి.. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాను.. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు.. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను.. మీకు లిఖిత పూర్వకంగా రాసిస్తాను.. నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్లనంటూ విష్ణు ప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విష్ణుప్రియ అంత మాట్లాడి..ఇప్పుడు ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బు కోసమే వెళ్లి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే విష్ణుప్రియ స్టేజ్ మీద మాత్రం ఇంకోలా చెప్పింది. గత సీజన్ నుంచే తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా ఓ విజన్ వచ్చిందని చెప్పేసింది. విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడు విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.
ఇక విష్ణుతో పాటు నాగపంచమి సీరియల్‌లో మోక్ష అనే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పృథ్వీ శెట్టి కూడా బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీని యాంకర్ విష్ణుతో కలిపి జంటగా హౌస్‌లోకి నాగార్జున పంపిచాడు.