English | Telugu
బిగ్ బాస్ లో నాగార్జునని ఆట ఆడుకున్న బెజవాడ బేబక్క..
Updated : Sep 2, 2024
బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా మొదలయ్యింది. అన్ లిమిటెడ్ అంటూ మొదలెట్టిన ఈ సీజన్ లో ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎలాంటి ఢోకా లేనట్లు ఉంది. ఎందుకంటే బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది కాబట్టి. అసలు వచ్చీ రావడంతోనే నాగార్జునని ఓ ఆట ఆడేసుకుంది బేబక్క. ఈమె అసలు పేరు మధు నెక్కంటి.
బెజవాడ బేబక్కగా ఎందుకు మారింది? హౌస్‌లోకి ఎవరితో కలిసి ఎంట్రీ ఇచ్చింది బేబక్క. నాగార్జునకి చాలా హార్ట్స్ పంపిందండి బాబూ.. దెబ్బకి నాగ్ అయితే ఏందిరా నాకు ఈ టార్చర్ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక చివరగా నువ్వు రావాలి అనగానే బేబక్క వచ్చేసింది. ఇక ఆ తర్వాత శేఖర్ భాషా వచ్చేశాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్-లావణ్యల విషయంలో వైరల్ గా మారిన ఆర్జే శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. తనకి మ్యాడ్ వస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టుకెళ్తా అన్నాడు. ఇక ఇద్దరు కలిసి జోడీగా లోపలికి వెళ్ళారు. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా యష్మీ గౌడ వచ్చేసింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద పాత్రలో నెగెటివ్ పాత్రతో ఆకట్టుకుంది. రెండవ కంటెస్టెంట్ గా నిఖిల్ వచ్చాడు. ఇతను సీరియల్ యాక్టరే కావడం విశేషం. ఇక వీరిద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు. మూడవ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ అలియాస్ 'పెళ్ళి చూపులు' విష్ణుగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత రామన్నా యూత్ తో దర్శకుడిగా మారాడు. ఇతనిది సిద్దిపేట్ లోకల్ . ఇక ఇతనికి బడ్డీగా నాల్గవ కంటెస్టెంట్ గా ప్రేరణ కంబం వచ్చింది. తను కృష్ణ ముకుంద మురారి లో కృష్ణ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ప్రేరణ-అభయ్ ఇద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు. బిబి హౌస్ లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.