English | Telugu

బాబు కోసం ఎందుకు నీ స్థాయిని తగ్గించుకుంటున్నావు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -378 లో... అనామిక వస్తుంటే తనని చూసిన రాహుల్, రుద్రాణి కావాలనే, తనకి వినిపించాలని మాట్లాడుకుంటారు. నువ్వు కూడ అందరిలాగే అసలు సపోర్ట్ చెయ్యవ్..నువు అస్సలు మమ్మీవేనా అని రాహుల్ అంటాడు. నేనేం అన్నానురా అని రుద్రాణి యాక్టింగ్ చేస్తుంది. చేసినదంతా చేసి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావని రాహుల్ అంటాడు. అప్పుడే అనామిక విని వాళ్ళ దగ్గరికి వస్తుంది.

ఏమైంది ఆంటి? ఏం జరిగిందని అనామిక అడుగుతుంది. కళ్యణ్ ఎలాగూ ఎండీ అయ్యాడు. కనీసం వాడిని జనరల్ మేనేజర్ అయినా చెయ్యాలంటున్నాడని అనామికకి రుద్రాణి చెప్తుంది. నాకు ఇంత హెల్ప్ చేసావ్ కళ్యాణ్ కి చెప్పి ఆ మాత్రం చెయ్యలేనా అని అనామిక అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చింది.. ఈసారి నువ్వు ఏంటో నిరూపించుకోమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది.

మరొకవైపు బాబు ఏడుస్తుంటే "అమ్మ వస్తుంది.. ఆగు" అని రాజ్ చెబుతూ ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తుంటే అప్పుడే కావ్య వస్తుంది. "ఎవరు అమ్మ" అని కావ్య కోప్పడుతుంది. "ఏం మాట్లాడుతున్నారు? ఎవరి కన్న బిడ్డకి ఎవరిని తల్లిని చేస్తున్నారు? మీ కన్నబిడ్డకి నన్ను తల్లిని చేస్తున్నారా? మీకు ఎలా కన్పిస్తున్నాను" అంటూ కావ్య చిర్రుబుర్రులాడుతుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నానని రాజ్ అనుకుంటాడు. ఈయన హెల్ప్ తోనే ఆ వెన్నెల అడ్రస్ కనుక్కోవాలని కావ్య అనుకొని.. నాకు ఒక హెల్ప్ చెయ్యండి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది.. ఇప్పుడు టచ్ లో లేదు.. ఎలా కనుక్కోవాలని అడుగుతుంది. సోషల్ మీడియా ద్వారా లేక మీకు కామన్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వొచ్చని కావ్యతో రాజ్ చెప్తాడు.

ఆ తర్వాత ఇంటికి లాయర్ వస్తాడు. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నేనే రప్పించానని రాజ్ చెప్తాడు. అసలు ఎందుకు రమ్మన్నావని రుద్రాణి అడుగుతుంది. కళ్యాణ్ ఎండీ అయ్యాడు.. చెక్ పవర్ వాని పేరుకు ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నాని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత అసలెందుకు ఆ బాబు కోసం ఇంత పెద్ద బాధ్యతలు వద్దనుకుంటున్నారని రాజ్ ని కావ్య అడుగుతుంది. రాజ్ ఎప్పుడు సింహాసనం మీదనే ఉండాలి. ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో ఆ బాబు కోసం నీ స్థాయిని తగ్గించుకుంటున్నావ్.. ఇప్పటికైనా ఆ బాబుని వదిలిపెట్టని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.