Read more!

English | Telugu

వర్ష కన్నా ఇమ్మాన్యుయలే బాగుంటాడంట!

బుల్లితెర యాంకర్ వర్ష తన అందాల ఆరబోతతో మరోసారి వైరల్ గా మారింది. రగడ సినిమాలోని "అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగ" అనే పాటకి చిరుతపులి లాంటి పొట్టి గౌనుతో అలా ర్యాంప్ వాక్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

అయితే ఈ రీల్ కి రెండు రోజుల్లోనే 1.7మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే వర్షని కొంతమంది‌ జూనియర్ సమంత అని అంటారు. మరికొంతమంది అసలు అమ్మాయేనా అని కూడా అంటారు. అయితే ఎవరెలా అన్నా కూడా అవి నెటిజన్లకి నచ్చేస్తుంటాయి. అయితే ‌తాజాగా‌ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఈ రీల్ కి వీక్షణలే కాదు కామెంట్లు బోలెడు వచ్చాయి. అందులో పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా రావడంతో ఈ రీల్ మరింతగా పాపులారిటీ ‌తెచ్చుకుంది. సూపర్, ‌నైస్, జూనియర్ సమంత, ఏంజిల్, బ్యూటిఫుల్ అంటు కొందరు పాజిటివ్ కామెంట్లు చేయగా.. నీ కన్నా ఆ ఇమ్మాన్యుయల్ గాడే నయం కదా అని ఒకరు కామెంట్ చేయగా.. లోపల ఏం లేదు.. డొల్ల అని మరొకరు కామెంట్ చేశారు. సముద్రంలో దొరుకుతుంది ఉప్పు మా అక్క నిప్పు అని ఒకరు కామెంట్ చేశారు. మీ అమ్మనాన్నకి నా తరుపున థాంక్స్ చెప్పు.. నీ అందం చూసే అదృష్ణం నాకు కల్గించినందుకు అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగెటివ్ గా కామెంట్ చేయగా.. పాజిటివ్ గా చేసినవాళ్ళకి రిప్లై ఇచ్చింది వర్ష. 

జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్నవారిలో వర్ష ఒకరు. స్క్రీన్ మీద వర్ష, ఇమ్మాన్యుయల్ కలిసి చేసిన కొన్ని స్కిట్లు హిట్ అవ్వడంతో వారిమధ్య‌ లవ్ ఉందని.. లవ్ సింబల్స్, బెలూన్ల సెటప్‌తో మంచి రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ వేశారు జబర్దస్త్ షో మేకర్స్. ఆ తర్వాత ఓ స్కిట్ లో ఉండిపోవా నువ్విలా అంటూ సవారి సినిమాలోని పాటకు ఇమాన్యుయేల్, వర్ష రెచ్చిపోయారు. ఆ మధ్య ఇలానే ఓ సారి ఈవెంట్ కోసం పెళ్లి నాటకం ఆడారు. ఇక ఆ తర్వాత నుండి వర్ష, ఇమాన్యుయేల్ జంట మీద నెట్టింట్లో తెగ ట్రోలింగ్ జరిగింది. దాంతో ఈ ఇద్దరూ కాస్త దూరంగానే  ఉంటున్నారు. రొమాంటిక్ పాటలు, లవ్ స్కిట్లు, లవర్లుగా నటించడం వంటివి తగ్గించారు. అయితే వర్ష చేసిన ఈ ట్రెండింగ్ రీల్ ని మీలో‌ఎంతమంది చూశారు.