English | Telugu

దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ బ్యూటీ!

ఇదేందయ్యా ఇది.. ఇది నేను సూడలే. సెలబ్రిటీ హోదాలో ఉన్న కొంతమంది రోజు రోజుకి చిత్రవిచిత్ర పనులు చేస్తున్నారు. కొంతకాలం క్రితం వీజే సన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఏటీఎమ్ చోరీకి ప్రయత్నించగా అది వైరల్ గా మారింది. ఇప్పుడు మరో బ్యూటీ దొంగతనం చేసి నెట్టింట వైరల్ గా మారింది. ఆ బ్యూటీ ఎవరో కాదు అరియానా గ్లోరీ.

ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ పండుతో అరియానా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. సోషల్ మీడియాలో అరియానా తన షోలకు సంబంధించిన అప్టేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అరియానా ఓ దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లింది. ఆ పార్టీ జరిగిన కొద్దిదూరంలోనే ఓ తోట ఉండగా.. అందులో వాళ్ళు పాలకూర వేయడంతో దాన్ని దొంగలించడానికి వీరిద్దరు కలిసి వెళ్లారు. జెస్సీ ఇదంతా వీడియో తీస్తుండగా అరియనా దొంగతనం చేసింది. ఇది పాలకూరనో చుక్కకూరనో తెలియడం లేదు.. ఇక్కడంతా చీకటిగా ఉంది నాకు దొంగతనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అరియానా అంటుంటే..‌ ఒక కట్ట 10 రూపాయిలు వస్తుందని జెస్సీ అన్నాడు. డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు దొంగతనం చేయడంలో థ్రిల్ గా ఉంటుందంటూ అరియానా, జెస్సీ కలిసి పాలకూర మొత్తాన్ని దొంగతనం చేశారు.

ఈ వీడియోను అరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓవైపు ఇదేం పాడు అలవాటు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. దొంగతనం చేయాలనే కంగారులో ప్యాంటు వేసుకోవడం కూడా మర్చిపోయావు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అరియానా దొంగతనం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీలో ఎంతమంది ఈ వీడియోని చూశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.