Read more!

English | Telugu

Karthika Deepam2 :  ఇంట్లో నుండి వెళ్ళకుండా దీపని అడ్డుకున్న కార్తిక్!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-14 లో.. దీప, శౌర్య కలిసి అవుట్ హౌస్ లో ఉంటారు. కాసేపటికి దీప దగ్గరికి పారిజాతం వస్తుంది.  అంతా బాగుందా అని పారిజాతం అడుగగా.. బాగానే ఉందని దీప అంటుంది. ఏ ఊరని , ఏం చేస్తుంటావని , ఇక్కడి మాలాంటి పెద్దొళ్ళ ఇంట్లో పనిచేయడానికే వచ్చావా అని దీపని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంది. తప్పక‌ ఇక్కడ ఉండాల్సి వస్తుందని దీప అనగా.. నాలాంటి ఆత్మాభిమానం గల వారైతే ఒక్క నిమిషం కూడా ఇలా ఉండరు. అలా ఉండాలంటే ఒక్కటి తింగరిదైనా అయి‌ ఉండాలి. లేదంటే మోగుడు వదిలేసిన ఆడదైనా అయి ఉండాలని దీపని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంది. అలా   తక్కువ చేసి మాట్లాడకండి మేడమ్ పాప వింటే బాధపడుతుందని దీప అంటుంది. ఇక ఇక్కడ ఉండాలో లేదో నీ ఇష్టం అని పారిజాతం చెప్పేసి వెళ్ళిపోగానే‌.. దీప బ్యాగ్ తో బయటకు వెళ్ళాలని శౌర్యని తీసుకొని వస్తుంది. 

అదేసమయంలో దీపని కార్తిక్ చూస్తాడు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు కార్తీక్. ఎక్కడికి వెళ్తే మీకెందుకు బాబు అని దీప అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే.. తిరిగి రావడానికి వెళ్తున్నట్టు అనిపించడం లేదని కార్తిక్ అంటాడు. మీ నుంచి దూరంగా వెళ్తున్నామని దీప అనగానే.. ఆ దూరానికి ఓ పేరు ఉంటుంది కదా అని కార్తిక్ అంటాడు. అది వెళ్లేవాళ్లకి తెలిస్తే సరిపోతుందని దీప.. ఆ వెళ్లేవాళ్లకోసం తెలియాలి అనుకునే వాళ్లు ఉంటారు కదా అని కార్తిక్ అంటాడు. వెళ్లాలని దీప అనగానే.. దాంతో కార్తీక్.. సరే నిన్ను ఇక ఆపను. రేపు పోలీస్ ఎంక్వైరీ ఉంది.. అది కంప్లీట్ అయిన తరువాత వెళ్లండి.. ఇలా రాత్రి పూట ఎవరికీ చెప్పకుండా వెళ్లడం కరెక్ట్ కాదు.. మా అత్తతో చెప్పి వెళ్లండి అని కార్తిక్ అంటాడు. మీరు అడ్డుతప్పుకోండి బాబూ.. ఎవరికీ చెప్పాల్సిన పరిస్థితిలో నేను లేను.. ఇంతకుమించి మాట్లాడలేనని దీప అంటుంది.

ప్లీజ్.. ఒక్క మాట అత్తతో చెప్పండి. ఫోన్ చేస్తాను మాట్లాడండి అని కార్తిక్ అంటాడు.  మీకు చెప్తే అర్థం కాదా? మీరు ఎవరితోనూ చెప్పాల్సిన పని లేదు.. అసలు మీరెందుకు నా విషయంలో కలగజేసుకుంటున్నారు.. అడ్డుతప్పుకోండి అని దీప‌ కోప్పడుతుంది.  అమ్మా.. నాకు నిద్ర వస్తుంది.. మనం వెళ్తున్నామా? లేదా? అని శౌర్య అంటుంది. ఆ మాటతో కార్తీక్.. కనీసం ఆ పసిదాని గురించి అయినా ఆలోచించండి అని దీపతో అంటాడు. పాప గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా అని దీప అంటుంది. ఇదే మీ ఆఖరి మాట అయితే.. నా మాట కూడా వినండి.. ఇంత రాత్రివేళ.. వెళ్లడానికి వీళ్లేదు. ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే.. అత్తతో చెప్పి వెళ్లండి.. ఇంట్లోకి వెళ్తారో.. అత్తతో చెప్పి బయటకు వెళ్తారో మీ ఇష్టం.. రెండింటిలో ఏదోటి జరిగే వరకూ నేను ఇక్కడ నుంచి కదలనని అక్కడే నిలబడిపోతాడు కార్తీక్. దీంతో దీప.. అంతా నా కర్మ ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అంటూ మళ్లీ వచ్చిన దారినే బ్యాగ్ పట్టుకుని లోపలికి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం‌ ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది రౌడీలని తోసుకొస్తారు పోలీసులు. వాళ్ళని చూసిన దీప.. వీళ్ళలో ఎవరు లేరని దీప చెప్తుంది.  ఈ ఎంక్వైరీ అయ్యేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు.. వెళ్తే అడ్రెస్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని పోలీసులు చెప్పగా.. అవసరం లేదు మేడమ్ .. దీపకు నా గ్యారెంటీ అని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.