English | Telugu

Krishna Mukunda Murari : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -439 లో... మురారిని బయటికిపోమని ఆదర్శ్ అనడంతో అతను అలిగి వెళ్ళిపోతుంటాడు. అది గమనించిన మీరా.. ముకుంద విషయంలో తప్పు చేసింది మురారీ కాదు.. కృష్ణ కారణంగానే ముకుంద ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మురారి వల్ల కాదు.. ఈ విషయాలన్నీ మీకు తెలియదు ఆదర్శ్ గారు అంటూ లేనిపోనివన్నీ చెబుతుంది. దాంతో ఆదర్శ్‌కి కాస్త మురారీ మీద కోపం తగ్గుతుంది. కానీ కృష్ణ మీద పగ పెరిగిపోతుంది. మరోవైపు మురారీ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఇంట్లోంచి వెళ్లిపోదాం. నువ్వు అందరి ముందు నాదేం తెలియదని అనొద్దు.. ఇది మనిద్దరి నిర్ణయం అన్నట్లుగానే ఉండు అంటూ కృష్ణకు మురారీ ముందే చెప్పి లగేజ్‌తో పాటు కిందకు వచ్చేస్తాడు. వెనుకే కృష్ణ తలదించుకుని నడుస్తుంది. అయితే ఆదర్శ్ సోఫాలోనే కూర్చుని ఉంటాడు. మురారీ, కృష్ణ బ్యాగ్ తీసుకుని కిందకు దిగేసరికి.. రేవతి, మీరా, రజినీ, సంగీత, సుమలత, మధు అంతా కంగారుగా చూస్తుంటారు.

వెళ్లిపోతున్నాం అమ్మా.. ఇక ఉండలేమని మురారీ అగానే.. అది విన్న మీరా గుండె ఆగిపోతుంది. నేను నీకోసం వస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోతావా అని మీరా భాదపడుతుంది. ఇక రేవతి, మధు, సుమలత అంతా మురారీని బతిమిలాడుతుంటారు. కృష్ణను వేడుకుంటారు. కానీ ఆదర్శ్ మాత్రం కదలడు. అమ్మా.. నేను అంటేనే వాడికి పడటం లేదు. అలాంటిది నువ్వు అంటే పడుతుందనుకుంటున్నావా? నువ్వు కూడా మాతో వచ్చెయ్ అమ్మా అని రేవతితో మురారి అంటాడు. అలా అన్నా కూడా ఆదర్శ్ కదలకుండా మౌనంగా ఉంటాడు. నేను వెళ్తే వెళ్తాను.. నిన్ను తీసుకెళ్తాను అంటున్నా వాడు కదలడం లేదు చూడమ్మా.. ఇప్పుడైనా అర్థమైందా వాడి దృష్టిలో నీ విలువ.. అమ్మా మాతో వచ్చెయ్ అని మురారి అనగానే.. రేవతి సరేనంటుంది. ఇక ముగ్గురూ వెళ్తుంటే.. సుమిత్ర, మధు ఇద్దరూ.. ఆదర్శ్ ముందుకు వెళ్లి.. మాట్లాడతా, ఆగమని చెప్పు.. ప్లీజ్ చెప్పు.. వాళ్లు వెళ్లిపోతున్నారని అడుగుతారు. అయిన ఆదర్శ్ కదలడు. పెద్దపెద్దమ్మ అంటూ భవానిని మధు పిలుస్తాడు. వద్దని చెప్పి కృష్ణ, రేవతి, మురారి బయటకు వస్తుంటారు. వాళ్ళ వెనుకే మధు, సుమలత, మీరా అంతా కంగారుగా వెళ్తుంటారు. ఇక బయట వారికి ఎదురుగా భవాని నిలబడి ఉంటుంది. ఏంటి మురారీ.. నువ్వు వెళ్తున్నావ్ సరే.. రేవతీని ఎందుకు తీసుకెళ్తున్నావని కోపంగా అంటుంది. ఇంతలో ఆదర్శ్ తూలుతూ బయటికి వస్తాడు. ఆదర్శ్‌ని కోపంగా చూసిన భవాని.. మిమ్మల్ని ఎవరు బయటికి వెళ్లమన్నారు.. అందుకు వాళ్లనే కారణం చెప్పమను.. అప్పుడు నేను నిర్ణయిస్తాను.. మీరు వెళ్లాలో ఉండాలో అని భవాని అంటుంది. అడుగుతున్నాను కదా.. కారణం చెప్పమని భవాని అంటుంది. క్షమించండి పెద్దత్తయ్యా.. మీకు కారణం చెప్పకుండా వెళ్లడం తప్పే. కానీ ఈ ఒక్క విషయం మమ్మల్ని క్షమించండి..వెళ్లక తప్పని పరిస్థితి అని భవానితో కృష్ణ అంటుంది.

మిమ్మల్ని వెళ్లమన్నా వారి గురించి మాట్లాడుతున్నా మీ గురించి కాదు.. ఒకే ఒక్క కారణం చెప్పమనండి.. నేనే మిమ్మల్ని పంపించేస్తానని భవాని అంటుంది. పెద్దపెద్దమ్మ అడుగుతోంది కదా.. వాళ్లు ఇంట్లో ఉండకూడదంటే ఒక కారణం చెప్పని ఆదర్శ్ ని మధు అడుగుతాడు. వెంటనే ఆదర్శ్ కోపంగా మురారీ ముందుకు వచ్చి.. మురారీ కళ్లల్లోకి చూస్తూ.. వాళ్ళ చేతిలోని లగేజ్ బ్యాగ్ పట్టుకుని లోపలికి వెళ్లిపోతాడు. అయిపోయింది కదా.. ఇంకెప్పుడూ అలా బ్యాగ్స్ పట్టుకుని బయలుదేరకండి.. లోపలికి వెళ్లండి.. వెళ్లండి అంటూ భవాని అరుస్తుంది. హమ్మయ్యా మురారీ వెళ్లలేదు. ఈసారి ఆదర్శ్‌ని రెచ్చగొట్టేటప్పుడు.. ఒకటికి పది సార్లు ఆలోచించి రెచ్చగొట్టాలి. నేను ఏం చెబితే అది మాత్రమే చేసేలా నా గుప్పెట్లో పెట్టుకోవాలని మీరా ఫిక్స్ అవుతుంది. తరువాయి భాగంలో హోలీ సంబరాలు జరుగుతుంటాయి. మురారీ, కృష్ణలు హోలీ ఆడుతుంటే రగిలిపోతుంది మీరా. అయితే మీరాను అడ్డంగా నిలబెట్టి కృష్ణ.. మురారీని ఆటపట్టిస్తుంది. రంగు మీద పడకుండా మీరానే అడ్డం పెట్టుకుంటుంది. అయితే మురారీ.. కృష్ణ మీద రంగు వేయబోయి.. మీరా మీద వేస్తాడు. వెంటనే మీరా.. కళ్లనిండా మురారీపై ప్రేమని చూపిస్తూ.. మురారీ ముఖానికి రంగులు రాస్తుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.