ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పుట్టినరోజు గిఫ్ట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో, ఈ మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, మే 20 ఎన్టీఆర్ బర్త్ డే.తన పుట్టిన రోజున అభిమానులకు ఏదొక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాడు తారక్. గతేడాది బర్త్ డే కు, తన కొడుకు అభయ్ రామ్ ఫోటోలు విడుదల చేసి, అభిమానులందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు