English | Telugu

ఎట్టకేలకు చిరంజీవి కత్తి మొదలైంది..!

ఎట్టకేలకు చిరు 150 సినిమా మొదలైంది. చాలాకాలంగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న చిరంజీవి కత్తి రీమేక్ మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని చిరు పాత ఇంట్లో అతి కొద్ది మంది మిత్రులు, సన్నిహితుల మధ్య సినిమా స్టార్ట్ అయింది. మెగాబ్రదర్ నాగబాబు గౌరవ దర్శకత్వం వహిస్తే, అల్లు అరవింద్ కెమేరా స్విచాన్ చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. తమిళ కత్తిని రీమేక్ చేయాలనుకున్న తర్వాత చిరు ఆ కథను వినాయక్ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే.

చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా స్టోరీని వినాయక్ మార్పులు చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే వినాయక్ స్క్రిప్ట్ ను చిరు లాక్ చేసేశారు. స్క్రిప్ట్ కు వినాయక్ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయించడం విశేషం. ఈరోజు తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో, సినిమాను సన్నిహితుల మధ్య ప్రారంభించేసిన మెగాక్యాంప్, మే చివరి వారంలో మరోసారి గ్రాండ్ గా లాంఛ్ చేస్తారని మెగా సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. చిరు సరసన అనుష్క లేదా నయనతారను తీసుకునే అవకాశాలున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.