English | Telugu

చిరు, బాలయ్య ఇద్దరూ నయనతారను అడగలేదట..!

మెగాస్టార్ 150 వ సినిమా ఈరోజు ప్రారంభమైంది. బాలకృష్ణ కూడా కొన్ని రోజుల ముందు తన వందో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించేశారు. మరి ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్లు ఎవరబ్బా అనే డౌట్ ఇద్దరి అభిమానులకూ ఉంది. సీనియర్ హీరోల పక్కన నటించాలంటే వినబడే పేరు నయనతార. ఈ రెండు సినిమాల కోసం నయనను సంప్రదించారని, కానీ కాల్షీట్స్ ఖాళీ లేవని నయన చెప్పేసిందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ వార్తలపై స్పందించిందీ భామ. " అసలు నన్నెవరూ అడగనే లేదు. అలాంటప్పుడు ఇక నేను నో ఎక్కడ చెబుతాను. అయినా నా కాల్షీట్స్ అందుబాటులో ఉంటే అలాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ లో తప్పకుండా నటిస్తా. ఆ రెండు సినిమాలకూ సంబంధించి ఇప్పటి వరకూ నన్నెవరూ అడగలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల, నా కెరీర్ కు బ్యాడ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వార్తలపై మాట్లాడుతున్నాను " అని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్టే. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న బాబు బంగారంలో యాక్ట్ చేస్తున్న నయన డైరీలో ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ కనబడట్లేదు. మరి చిరు బాలయ్యలు తమ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ లో నయన్ గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.