English | Telugu

సరైనోడు ఫస్ట్ వీక్ ఏరియావైజ్ కలెక్షన్స్..!

అల్లు అర్జున్ సరైనోడు రిలీజై వారం అయిపోయింది. మొదటి రోజు డివైడ్ టాక్ తో మొదలైన సరైనోడి ప్రయాణం, ఉండేకొద్దీ స్పీడ్ పెరగడం పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. రివ్యూలు, క్రిటిక్ లు సినిమాను తీసి పారేసినా, సరైనోడు మాత్రం హాళ్లలో కలెక్షన్లు కుమ్మేసుకుంటున్నాడు. ఫలితంగా, మొదటి వారం ముగిసేసరికే, వరల్డ్ వైడ్ కలెక్షన్లు 50 కోట్లను సమీపించాయి. బన్నీ కరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిన సినిమాగా సరైనోడు గురించి చెబుతున్నారు. మొత్తమ్మీద బన్నీ ఖాతాలో మరో హిట్టు పడిపోయినట్టే. ఇంకొన్ని రోజుల పాటు పెద్ద సినిమాలేవీ లేని కారణంగా, అల్లు వారి సినిమాకు కలెక్షన్లు ఢోకా ఉండవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఏరియావైజ్ సరైనోడు కలెక్షన్ రిపోర్ట్ (కోట్లలో) :


నైజాం 11.36
సీడెడ్ 6.80
వైజాగ్ 4.43
తూర్పు గోదావరి 2.90
పశ్చిమ గోదావరి 2.60
కృష్ణా 2.28
గుంటూర్ 3.24
నెల్లూరు 1.36
కర్ణాటక 5.96
ఇండియా వైడ్ 1.09
ఓవర్సీస్ 3.70

మొత్తం 45.72

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.