English | Telugu

ఓటు వేయనంటున్న కమల్..! అదే కారణమా..?

ఓటు వేయండి..ఓటు హక్కును ఉపయోగించుకోండి అంటూ సినీ స్టార్స్ ఎలక్షన్ల టైంలో ఊదరగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కమల్ హాసన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా తాను అసలు ఓటే వేయను అంటూ చెప్పడం విచిత్రం. శభాష్ నాయుడు మూవీ ప్రారంభోత్సవంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 16న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కదా! మీరు ఓటు వేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, నేను ఓటే వేయను అన్నారు కమల్. ఓటర్ లిస్ట్ లో తన పేరు లేకపోవడమే అందుక్కారణం అని ఆయన చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని వెళ్తే, అప్పటికే ఆయన ఓటు ఎవరో వేసేశారట. సర్లే పోనీ ఈ సారైనా ఓటేద్దామనుకుంటే, అసలు ఓటర్ లిస్ట్ లోనే ఆయన పేరు లేదట. ఎన్నికల కమిషనర్ తనకు ఫ్రెండే అయినా, చేసేదేమీ లేకపోయిందంటూ కమల్ చెప్పడం విచిత్రం. కాగా దశావతారంలోని బలరాం నాయుడు పాత్రనే మరింత విస్తరించి ఈ సినిమాను తీస్తున్నట్లు లోకనాయకుడు చెబుతున్నారు. బలరాంనాయుడు, అతని భార్య, కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని, భార్య పాత్రకు రమ్యకృష్ణ, కూతురి పాత్రకు శృతిహాసన్ ను తీసుకున్నామని కమల్ తెలిపారు. తెలుగు తమిళంలో శభాష్ నాయుడు అన్న పేరుతో, హిందీలో శభాష్ కుందు పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. చాలా కాలం తర్వాత ఇళయరాజా కమల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.