English | Telugu

నారావారబ్బాయి హిట్టు మీద దృష్టి పెడతాడా..?

వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడం, వారాల వ్యవధిలో కొత్త సినిమాలు రిలీజ్ చేసేయడం మంచిదే. కానీ వాటిలో ఒక్కటైనా సూపర్ హిట్ పడితేనే కదా వాల్యూ ఉండేది. ఈ విషయం నారావారబ్బాయి రోహిత్ కు ఇంకా అర్ధం కాలేదు. వరసగా తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే సినిమాల్ని రిలీజ్ చేశాడు. కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నారా రోహిత్ ఫిజిక్, ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా డ్యాన్స్ స్టెప్ ను కంప్లీట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోహిత్, వరస సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి, తన అప్పియరెన్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందనేది సినీజనాల ఒపీనియన్. ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడం వలన, సినిమాల సంఖ్య పెరుగుతుంది తప్ప, వేరే ఎటువంటి లాభమూ ఉండదు. ఇప్పటికే మూడు రిలీజ్ చేసేసిన రోహిత్ జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి, అప్పట్లో ఒకడుండేవాడు, పండగలా వచ్చాడు అంటూ మరో నాలుగు సినిమాలతో త్వరలోనే మళ్లీ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. కానీ తన ఇంప్రూవ్ మెంట్ లేని పెర్ఫామెన్స్ తో, హడావిడిగా తెరకెక్కించేసిన సినిమాలతో, రోహిత్ ఏ మేరకు సక్సెస్ కొడతాడనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా కాస్త గ్యాప్ ఇచ్చి కథ, కథనాలు, బాడీ ఫిజిక్ పై దృష్టి పెడితే బాగుంటుందనేది సినీజనాల అభిప్రాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.