English | Telugu

భారత్‌ లో 30 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,310 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 740 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,945కి చేరగా.. కరోనా మరణాల సంఖ్య 30,601కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 8,17,209 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులున్నాయి.