ఆంధ్రాలో అదుపు లేని ‘పోలీస్రాజ్’
తమ బాసు వరసగా హైకోర్టు మెట్లెక్కి.. న్యాయమూర్తుల వ్యాఖ్యలతో అవమానాలకు గురవుతున్నా, కింది స్థాయి పోలీసులకు అదేమీ పట్టడం లేదు. ఎమ్మెల్యేల దన్నుతో.. స్థానికంగా తమకు ఎదురులేదని చెలరేగిపోతున్న అధికారుల అత్యుత్సాహం, డీజీపీకి చెలగాటంగా మారింది.