English | Telugu
టోపీపై ఉన్న మూడు సింహాలను డీజీపీ తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టారా..? టీడీపీ నేత సూటి ప్రశ్న
Updated : Sep 29, 2020
ఏపీలోని హిందూ దేవాలయాల పై దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందన్న నిరాధార వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ పై ఎందుకు చర్యలు తీసుకోరు అని అయన సూటిగా ప్రశ్నించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కొడాలి నాని మాట్లాడినా డీజీపీ ఎందుకు స్పందించడంలేదని.. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని చట్టం చెబుతుంటే డీజీపీ ఎందుకు ఆ పని చేయరు? అని అయన ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలోని మూడు సింహాలు మాయమైపోయినట్లు.. మీ టోపీ పైన మూడు సింహాలు మాయం చేసేశారా డీజీపీ గారు.. మీ టోపీపై ఉన్న మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టారా? అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ ఈ సందర్భంగా కోరారు.