English | Telugu
దేనికీ పనికిరాని సన్నాసులు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి కొడాలి నాని
Updated : Sep 29, 2020
"టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని" కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయించి.. జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి తాజాగా ఆరోపించారు. "దేనికీ పనికిరాని కొందరు టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని, వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని అయన ఆరోపించారు. ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.