English | Telugu
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు
Updated : Sep 30, 2020
గత టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ.. వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.