90ఏళ్ల బ్రిటన్ బామ్మకు తొలి టీకా! రెండు వారాల్లో భారత్ కరోనా వ్యాక్సిన్ ?
కరోనా వ్యాక్సిన్ పంపిణిని ప్రారంభించింది బ్రిటన్. 90 ఏళ్ల వృద్ధురాలికి తొలి కరోనా టీకా ఇచ్చారు. ప్రపంచంలోనే కొవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన ఈ బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్ టీకా పంపిణీ అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్లో 90ఏళ్ల మార్గరెట్ కీనన్ తొలి టీకా వేయించుకున్నారు...