'NBK111' మూవీ లాంచ్.. చరిత్ర సృష్టించడానికి సై అంటున్న బాలయ్య!
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హవా నడుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకున్నారు. డిసెంబర్ 5న 'అఖండ-2'తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే ఉత్సాహంతో తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.