English | Telugu

ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి మరణ మాస్ అప్డేట్!

ప్రస్తుతం ఎన్టీఆర్(NTR) న్యూ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆఫ్ లైన్ లోనే ఇలా ఉంటే.. ఇక 'డ్రాగన్'(Dragon) సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడో అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసే మరో అప్డేట్ వచ్చింది. (NTR Neel)

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'డ్రాగన్'లో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఒకరు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేయడం విశేషం.

Also Read: సంక్రాంతి రన్నర్ చిరంజీవి.. మరి విన్నర్?

2026కి గాను ఐఎండీబీ ప్రకటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లో 'డ్రాగన్' కూడా ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని సంతోషం వ్యక్తం చేసిన అనిల్ కపూర్.. తాను కూడా ఈ సినిమాలో భాగమైనట్లు తెలిపారు. కాగా, ఎన్టీఆర్ గత చిత్రం 'వార్-2'లో కూడా అనిల్ కపూర్ నటించడం విశేషం.

శనివారం(జనవరి 17) నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. వచ్చే నెల జోర్డాన్ లో మరో షెడ్యూల్ జరగనుంది.

Also Read: పుట్టపర్తి సత్యసాయి బాబా 'అనంత' మూవీ రివ్యూ

ఎన్టీఆర్ కొత్త లుక్ పవర్ ఫుల్ గా ఉండటం, అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తుండటం, షూటింగ్ లో వేగం పెరగడం.. ఇలా వరుస అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

డ్రాగన్ ఫస్ట్ లుక్ మరియు స్పెషల్ గ్లింప్స్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.