English | Telugu

రష్మీ తామర పువ్వు ఎవరికి ఇస్తుందో.. సుధీర్ అన్న ఎక్కడ?

బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్ ఎవరంటే రష్మీ గౌతమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఇక ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా హోస్ట్ చేస్తూ ఉంది. అలాంటి రష్మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఒక దొప్పలో కూర్చుని పింక్ కలర్ లో ఉన్న తామర పువ్వును ఎవరికో ఇస్తూ సిగ్గుపడుతున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. "ఈ తామర పువ్వు నీకు..అరచేతిలో దాచుకునే ముఖం నాకు..నేను నా పింక్ సాక్స్...క్రేజి మార్నింగ్, క్రేజి మెమోరీస్" అంటూ ఒక పింక్ తామర పువ్వును ఎవరికో ఇస్తున్నట్టు కనిపించింది యాంకర్ రష్మీ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే "ఆ ప్రకృతి అందం అంతా మీలోనే ఉంది.